వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 14ఏళ్లు అధికారంలో ఉండి ఏ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపొందించారో ప్రజలకు చెప్పాలన్నారు. వ్యవసాయమే దండగన్న ఆయనకు ప్రాజెక్టులను సందర్శించే అధికారం ఎక్కడిదన్నారు. మహానేత వైఎస్ఆర్ జలయజ్ఞం పేరుతో రూ.60వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తే.. చంద్రబాబు కనీసం మోటర్లు సైతం ఏర్పాటు చేయలేదన్నారు. అలాంటి వ్యకి నేడు ప్రాజెక్టుల సందర్శనకు వస్తే ప్రజలు నమ్మరన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంకు నీరివ్వలేని చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన యాత్ర చేపట్టడం హాస్యస్పదంగా ఉందన్నారు.