రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలే సహకార సంఘాలు ఖాయిలా పడటానికి ప్రధాన కారణాలు.అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకుపోతూ అనేక కోఆపరేటివ్ సొసైటీలు ఖాయిలా పడుతున్నాయని వీటిని అరికట్టేందుకు చట్టపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే సహకార స్ఫూర్తికే ముప్పు వాటిల్లుతుందని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక సొసైటీలో అధ్యక్షుడు, బోర్డు కుమ్మక్కై సభ్యులకు మంజూరు చేసే రుణాల్లో 5 నుంచి 50 శాతం కిక్ బ్యాక్ కింద వసూలు చేస్తున్నారు. ఈ విధంగా మంజూరు చేసిన రుణాలు ఎప్పటికీ వసూలు అయ్యే అవకాశమే లేదు. ఇలాంటి ధోరణులు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలలో జరగకుండా నిరోధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రప్రభుత్వానికి సూచించారు.