నర్సీపట్నం మార్కెట్ యార్డులో గల డాక్టర్ వైయస్సార్ నియోజకవర్గ స్థాయి వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను మంగళవారం ప్రాంతీయ పశువ్యాధి నిర్ధారణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి. మోహినీకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రయోగశాలలో రికార్డులు పరిశీలించి జరుగుతున్న పరీక్షల వివరాలను అడిగి తెలు సుకున్నారు. రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు అవసరమైన సూచనలను సిబ్బందికి ఇచ్చారు.