లోక్ సభలో జరుగుతున్న అల్లర్లపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదేపదే సభా కార్యకలాపాలకు విపక్ష ఎంపీలు అడ్డంకులుగా నిలుస్తున్నారు. దీంతో సభలో ఎంపీలు గౌరవంతో ప్రవర్తించే వరకు తాను సభకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న స్పీకర్ బుధవారం సభాధ్యక్ష స్థానంలో కనిపించలేదు. మరోవైపు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఇవాళ లోక్ సభలో ఆమోదించాల్సి ఉండగా.. సభ వాయిదా పడటంతో బిల్ పెండింగ్ లో పడింది.