కడుపులో బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి మహిళకు సీఎం జగన్ అండగా ఉన్నారని మంత్రి రోజా అన్నారు. గర్భవతి, బాలింతల సౌకర్యార్థం ఇంటింటికే పోషకాహార కిడ్స్ పంపిస్తున్నామని అన్నారు. దేశంలో ఎందరో సీఎంలు ఉన్నారని, మాకు విజన్ ఉంది అని చెప్పుకునే డబ్బా రాయుళ్లు, 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే వాళ్లను సైతం చూశామని సెటైర్లు వేశారు. గత టీడీపీ పాలనలో రక్త హీనతతో గర్భిణీలు చనిపోయారని అన్నారు.