డోక్సరీ తుపాను ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్ అంతటా వరదలు ముంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇలాంటి వరద పరిస్థితులలోనే ఓ ప్రేమికుల జంట భారీ ఘనంగా వివాహం చేసుకుంది. వరదల కారణంగా తొలుత పెళ్లిని వాయిదా వేద్దామనుకున్నారు. అయితే ఏది ఏమైనా అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని వధువు పట్టబట్టడంతో వరద నీటిలోనే వీరి పెళ్లిని వైభవంగా పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడిచి వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు.