ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొంతమంది వాలంటీర్లు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ వాలంటీర్ వివాహితను లేపుకుపోయిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. గతంలో వాలంటీర్ గా పనిచేసిన వరలక్ష్మి అనే వివాహితను ప్రస్తుతం వాలంటీర్ గా పనిచేస్తున్న దిలీప్ తీసుకెళ్లిపోయాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.