కావలసిన పదార్థాలు
జొన్నపిండి: ఒక కప్పు, మెంతాకు: పావు కప్పు(చిన్నగా తరిగినది), ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాబేజీ తురుము: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, కారం: ఒక టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఒక గిన్నెలో తరిగిన మెంతి, ఉల్లిగడ్డ, క్యాబేజీ, పచ్చిమిర్చి, కారం, మిరియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జొన్నపిండి వేసి అవసరమైతే కాస్త నీళ్లు చేర్చి ముద్దలా చేసి అరగంటపాటు నానబెట్టాలి. నానిన పిండిని చిన్న ముద్దల్లా చేసుకుని కవర్‌పై నూనె రాసుకుని రొట్టెల్లా ఒత్తుకోవాలి. స్టవ్‌పై పెనం వేడయ్యాక రొట్టె వేసి రెండు వైపులా నూనెవేస్తూ దోరగా కాల్చుకుంటే మసాలా జొన్న రొట్టె సిద్ధం.