పెళ్లి వేడుకలో వధువుపై కుటుంబసభ్యులు నోట్ల వర్షం కురిపించారు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.8.5 కోట్లు కుమ్మరించారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో జరిగిన ఈ వివాహంలో వేదిక వద్ద వధువు నిలబడి ఉండగా.. కుటుంబం ఆమెపై కరెన్సీ నోట్లను విసురుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఫిబ్రవరి 14న జరిగిన ఈ వివాహ వేడుకలో కోట్ల రూపాయలను వధువుపై కుమ్మరించినట్టు వస్తున్న వార్తలపై వరుడి కుటుంబం స్పందించింది. అందులో ఎటువంటి నిజం లేదని ఖండించింది.
సంగీత్‌లో సరదాగా కరెన్సీని వధువుపై విసిరినట్టు వరుడి సోదరుడు సికందర్ సింగ్ పేర్కొన్నారు. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు రూ.8.5 కోట్లు కాదని, కేవలం రూ.2 లక్షలు ఖరీదైన నోట్లను మాత్రమే కుమ్మరించినట్టు వివరణ ఇచ్చారు. తన సోదరుడు ఆస్ట్రేలియాలో ట్రక్కు వ్యాపారం నిర్వహిస్తున్నాడని అతడు పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మరోవైపు, ఈ వివాహ వేడుకను నిర్వహించి ఈవెంట్ ఆర్గనైజేషన్ మేనేజర్ కూడా రూ.8.5 కోట్లు అనే ప్రచారం నిజం కాదన్నారు. అయితే, వధువుపై రూ.4 లక్షల విలువైన కరెన్సీ నోట్లను వెదజల్లినట్టు ఆయన చెప్పడం గమనార్హం. ఇందులో కొన్ని డాలర్లు కూడా ఉన్నట్టు తెలిపాడు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు విలాసవంతమైన ఈ పెళ్లి వేడుకను సమర్ధిస్తే... మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పెళ్లంటేనే సందడి. బంధువులు, స్నేహితులతో తెలియకుండానే సమయం గడిచిపోతుటుంది. వివాహానికి వచ్చిన స్నేహితులను వధూవరులను ఆట పట్టిచండం వంటివి సర్వసాధారణం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa