జాతీయ రహదారి మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులు గాయాలపాలైన ఘటన బుధవారం గణపవరం వద్ద చోటు చేసుకుంది. గణపవరానికి చెందిన షేక్ మస్తాన్‌వలి, చిలకలూరిపేటలోని మద్దినగర్‌లో నివాసం ఉంటూ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. వృద్ధాప్య పెన్షన్ కోసం తన తండ్రి షేక్ మౌలాలిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని గణపవరం వెళ్లి తిరిగి చిలకలూరిపేట వస్తున్నారు.