కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మసీదు ఆవరణలో సర్వే కొసాగించేందుకు పురావస్తు శాఖకు అనుమతినిచ్చింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. న్యాయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ సర్వే చేపట్టడం అవశ్యమని తీర్పు వెలువరించింది.