ఫోన్లో ఓ మహిళ మాట్లాడిన ఎఫైర్ మాటలు విని క్యాబ్ డ్రైవర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. హర్సగట్టకు చెందిన కిరణ్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఓ వివాహిత ఇంద్రానగర్ నుంచి బనస్వాడాకు క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ మహిళ తన ఫోన్లో బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడింది. అది విన్న కిరణ్ ఫ్రెండ్‌గా పరిచయమై రూ.22 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.