అమరావతి R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. నిర్మాణాలను వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, రాజధానేతర ప్రాంతవాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు R-5 జోన్ ఏర్పాటుతో పాటు 1,402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో రాజధాని గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.