పబ్జీ గేమ్‌లో పరిచయమైన ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ మీనా కోసం పాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌కు సినిమా ఛాన్స్ వచ్చింది. ఉదయ్‌పుర్ టైరల్ కన్హయ్యలాల్ హత్య కేసుపై ‘ఏ టైరల్ మర్డర్ స్టోరీ’ పేరిట సినిమా తెరకెక్కిస్తున్నారు. జానీ ఫైర్ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో ఈ సినిమాలో రా ఏజెంట్ పాత్ర కోసం సీమాను సంప్రదించారు. ఈ మేరకు చిత్రదర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్‌లు ఆమె ఆడిషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.