వృద్ధుల పింఛను డబ్బులతో వాలంటీర్ జూదమాడిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. విడపనకల్లు గ్రామ వాలంటీర్ ఈనెల 1న అధికారుల నుండి రూ. 89 వేల పెన్షన్ డబ్బులను తీసుకున్నాడు. డబ్బుతో నేరుగా కర్నూలు జిల్లా గుమ్మనూరుకు వెళ్లి జూదమాడి ఓడిపోయాడు. దీంతో విషయం బయటపడకుండా ఇద్దరు దుండగులు తనను బెదిరించి డబ్బు లాక్కెళ్లారని కథ అల్లాడు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపడంతో నిజం ఒప్పుకున్నాడు.