రామకుప్పం మండలం మిట్టపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో గురువారం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో గర్భవతులకు, బాలింతలకు జడ్పిటిసీ నితిన్ రెడ్డి చేతుల మీదుగా పౌష్టికాహారం కిట్లను అందజేశారు. బాలింతలకు, గర్భవతుల ఆరోగ్యం బాగుండాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పౌష్టికాహారం అందజేస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. వంశీ రెడ్డి, రామిరెడ్డి, మోహన్ రెడ్డి, మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.