ఓ బాలుడు హోం వర్క్ చేయతుండా కిడ్నాప్ డ్రామా ఆడిన ఘటన హిమాచల్‌ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లో జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు హోంవర్క్ చేయలేదని టీచర్ శిక్షిస్తాడని భయపడ్డాడు. ఇది తప్పించుకునేందుకు పక్క గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్తుండగా చీకటి పడటంతో గ్రామస్తులు చూసి ప్రశ్నించారు. దీంతో తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి నుండి తప్పించుకొని వస్తున్నానని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి, ఇదంతా బాలుడి కట్టకథ అని తేల్చారు.