రాయలసీమకు తీరని అన్యాయం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధ్వజమెత్తారు. రాయలసీమ గడ్డపై అడుగుపెట్టే ముందు ఈ ప్రాంత వాసులకు క్షమాపణలు చెప్పిన తరువాతే గడ్డపై అడుగుపెట్టాలని సూచించినా సిగ్గులేకుండా వచ్చాడని, చంద్రబాబును సీమ ప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసినట్టు చూపించగలడా..? అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ రైతాంగానికి నీరు రాకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ప్రాజెక్టులను సందర్శించడం సిగ్గుచేటన్నారు.