‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పేరులోనే తప్ప ఆయన పనులు మాత్రం చాలా అథమంగా ఉన్నాయి’’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ‘‘మంత్రి పెద్దిరెడ్డి కొడుకు మిథున్‌రెడ్డి చేస్తున్న దోపిడి తార స్థాయికి చేరింది. నాలుగేళ్లలో రూ.35 వేల కోట్లు కొల్లగొట్టిన విషయం సీఎం జగన్‌రెడ్డికి తెలీదా? ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియా, మద్యం వ్యాపారాలతో దోపిడీలో మంత్రి పెద్దిరెడ్డిదే అగ్రస్థానమని సొంత పార్టీ వారే మాట్లాడుతుంటే... తన కేబినెట్లోని మంత్రి చీకటి పనులు సీఎంకు తెలియకుండా ఉంటాయా’’ అని జీవీ ధ్వజమెత్తారు.