ఎస్సీ, ఎస్టీలపైదాడుల నివారణకు కఠిన చర్యలు చేపడతామని నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి అన్నారు. గత నెల 26న ఎస్టీలపై జరిగిన దాడి, గొర్రెల కాపరిపై జరిగిన దాడి కేసును ఆయన పాణ్యం సీఐ కార్యాలయంలో విచారించారు. డీఎస్పీ మాట్లాడుతుతూ చోరీలు, జూదం, మట్కా, నాటుసారా తదితర అసాంఘీక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గ్రామాలలో శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచుతామని, రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. పాణ్యం సీఐ వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌ఐ అశోక్, గడివేముల డీఎస్పీ వెంకటసుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.