తిరుపతి జిల్లా పరిధిలోని ఎస్వీయూలో మూడు రోడ్ల నిర్మాణానికి సంబందించి మూడు రోడ్లు ఎస్వీ యూనివర్సిటీకి అవసరం లేదని... దీనివల్ల యూనివర్సిటీకి ఏ ప్రయోజనం లేదంటూ ఎస్వీ యూనివర్సిటీ వీసీ రాజారెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఎస్వీ యూనివర్సిటీలో మూడు రోడ్ల నిర్మాణం వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఈరోజు బంద్ చేపట్టారు. బంద్ నిర్వహిస్తున్న విద్యార్థులకు ఎస్వీ యూనివర్సిటీ వీసి రాజ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా ఎస్వీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా యూనివర్సిటీ పవిత్రత దెబ్బతీసే రోడ్ల నిర్మాణానికి వ్యతిరేకమని తెలిపారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం పెట్టుకొని తమ నిర్ణయాన్ని మున్సిపల్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుపోతామన్నారు. విద్యార్థుల సెంటిమెంటే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.