ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతూ ఊబర్ ఈట్స్ డ్రైవర్ గా పని చేస్తున్న 22 ఏళ్ల భారత విద్యార్థి అక్షయ్ దీపక్ దౌల్తాని రోడ్డు ప్రమాదంలో మరణించాడు. న్యూ సౌత్‌వేల్స్‌లో బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ముంబైకి చెందిన అక్షయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మెక్వారీ యూనివర్సిటీలో ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేస్తూ ఆస్ట్రేలియా వచ్చాడు.