శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం, ముగుపురం గ్రామ నివాసితురాలు అయిన పుట్టుకతో మూగ, చెవిటి వికలాంగురాలైన 21 సంవత్సరాల వయస్సు గల మహిళపై ఎడ్ల రవికుమార్, సూర్యనారాయణ అనే వ్యక్తులు అత్యాచారానికి పాల్పడారు. నేర నిరూపణ అయినందుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ రాధిక గురువారం అన్నారు.