భర్తలు తమ భార్యలను ఆకట్టుకోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇలా తన భార్యను ఆకట్టుకోవడాని ఒక భర్త సీక్రెట్ ఏజెంట్‌గా నటించి, చివరకు అడ్డంగా బుక్కయ్యాడు. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన 31 ఏళ్ల గుంజన్ కాంతియా 4 ఏళ్లుగా సీక్రెట్ ఏజెంట్‌ను అని భార్యను నమ్మించాడు. అయితే ఆమెకు అతనిపై ఇంకా అనుమానం ఉంది. దీంతో ఆమె సందేహాలను నివృత్తి చేసేందుకు మంగళవారం సాయంత్రం జగత్‌పూర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయంలోకి వెళ్లగా.. అతని ఐడీ నకిలీదని అధికారులు గుర్తించారు. దీంతో మనోడు అడ్డంగా బుక్కయ్యాడు.