ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొంతమంది వాలంటీర్లు చేసే నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ వాలంటీరు ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో జరిగింది. బొమ్మలాటపల్లిలో అధికారులు తనిఖీలు చేయగా, మహిళా వాలంటీర్ ఇంట్లో 10 మద్యం సీసాలు దొరికాయి. వాలంటీర్ భర్త అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.