కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. ఈ దారుణం రాజస్తాన్లో భిల్వారాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మేకల కాపలాకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె సోదరుడు, గ్రామస్తులు వెతుకులాట మొదలుపెట్టారు. రాత్రికి గ్రామ సమీపంలోని మండుతున్న ఒక బట్టీలో బాలిక చేతి గాజు, ఎముక ముక్కలు..ఆ పక్కనే బాలిక చెప్పులు వారికి కనిపించాయి. బాలికపై అత్యాచారం చేశాక, చంపి కొలిమిలో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.