ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సత్యనారాయణమ్మ (66 ఏళ్లు) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణించారు. దాడిశెట్టి రాజాకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలుపుతున్నారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.