ఫేస్బుక్ ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాకిస్తాన్ వెళ్లిన అంజూ అక్కడ హ్యాపీగానే ఉంది. మతం మారి ఫాతిమాగా పేర్చుకుని ప్రియుడిని పెళ్లి చేసుకుంది. కానీ ఇండియాలోని అంజూ ఫ్యామిలీకి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అంజూ తండ్రి, భర్త, మరిది రోడ్డున పడ్డారు. ఉద్యోగం, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మతం మారడంపై పలువురు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.