కావలసిన పదార్థాలు
బీట్‌రూట్ తరుగు: రెండు కప్పులు, పెరుగు: ఒకటిన్నర కప్పు, ఉల్లి తరుగు: అరకప్పు, ఉప్పు: తగినంత, నూనె: 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు: రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము: పావు కప్పు, అల్లం: చిన్న ముక్క, ఎండుమిర్చి: రెండు.
తయారీ విధానం
ముందుగా మిక్సీజార్‌లో పచ్చికొబ్బరి, ఒక స్పూన్ ఆవాలు, అల్లం ముక్క వేసి మెత్తగా పేస్టు చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక వాటిని వేయాలి. మిగిలిన ఆవాలు వేగించి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు కూడా వేసి.. అన్నీ వేగాక బీట్‌రూట్ తురుము వేసి వేయించాలి. బీట్‌రూట్ బాగా వేగాక పచ్చి కొబ్బరి ముద్ద వేసి బాగా కలపాలి. చివరగా బాగా చిలికిన పెరుగులో బీట్‌రూట్ మిశ్రమం కలిపి పైనుండి ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ.