కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు వచ్చి చేరాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై చర్చించేందకు బుధవారం గోవా వెళ్లిన రాహుల్ గాంధీ గురువారం ఉదయం మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన నార్త్ గోవాలోని షేడ్స్ కెన్నెల్ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్మించారు. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన మూడు నెలల వయసు రెండు కుక్క పిల్లలను కొనుగోలు చేశారు. టెర్రియర్ జాతి శునకాలు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి.