కావలసిన పదార్థాలు
గుడ్లు: నాలుగు, టమాట గుజ్జు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: పావు కప్పు, దాల్చిన చెక్క: చిన్న ముక్క, జీలకర్ర: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
గుడ్లను ఉడకబెట్టి పెంకు ఒలిచి గాట్లు పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క వేసి బాగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక టమాట గుజ్జు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి సన్నని మంటపై నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా ఉడికించిన గుడ్లు, గరం మసాలా, కొత్తిమీర తురుము వేసి మరో నిమిషం పాటు ఉడికించి దించుకుంటే స్పైసీ ఎగ్ కర్రీ సిద్ధం.