రాంబిల్లి మండలంలోని పంచదార్లలో దర్జాగా అక్రమ కంకర దందా సాగిపోతుంది. పంచదార్ల రెవెన్యూ ధారపాలెం సమీపంలోని చారిత్రక శ్రీఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి కూతవేటు దూరంలో కంకర తవ్వకాలు సాగుతున్నాయి. సర్వే నంబరు-5లో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొండను తవ్వేస్తున్నారని , పంచదార్ల గ్రామస్థులు చెప్పారు. కంకరను పట్టపగలే దర్జాగా లారీల్లో తరలిస్తున్నారని వీఆర్వోకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.