విశాఖపట్నం జిల్లాలో భీమిలి, పెందుర్తి, పశ్చిమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సమస్యలపై కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష జరగనుంది. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, వైద్య శాఖ మంత్రి విడుదల రజినీ స్ధానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సమీక్ష చేయనున్నారు. యూపీహెచ్చీలు, పీహెచ్సీల నిర్మాణాలు తదితర వాటిపై సమీక్షించనున్నారు.