ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొండ్రముట్ల వద్ద 2,300 కి.మీ. మైలురాయికి చేరింది. ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి రాగానే వరికపూడిశెల ప్రాజెక్టు ఏర్పాటుకి కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.