ఢిల్లీ పరిపాలన అధికారాల బిల్లు-2023ను లోక్సభ ఆమోదించటం ద్వారా ఎన్నికైన ప్రభుత్వం అధికారాలను కోల్పోనుందని శివసేన (UBT) నాయకురాలు ప్రియాంక చతుర్వేది విమర్శించారు. ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల కంటే నామినేటెడ్ వ్యక్తులు ఇక పెత్తనం చెలాయిస్తారని ఆమె విమర్శించారు. ఇది ఢిల్లీ ప్రజలకు అన్యాయం చేయడమేనని దుయ్యబట్టారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్సభ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది.