సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా నెల రోజులపాటు చేపట్టిన జగనన్న సురక్ష పథకం ప్రజలకు శ్రీరామ రక్ష అని మంత్రి రోజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ.. జగనన్న సురక్ష పథకంలో 1.42 కోట్ల మంది ఇళ్లకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు వెళ్లి ఎవరెవరికి ఏయే సర్టిఫికెట్లు అవసరమో తెలుసుకుని 93 లక్షల మందికి 11 రకాల సర్టిఫికెట్లను పంపిణీ చేశారన్నారు. లంచం లేకుండా సేవ చేసిన ఘనత వైసీపీ పార్టీకి అధికారులకి నాయకులకి చెందుతుంది అని హర్షం వ్యక్తపరిచారు.