ఉత్తరాఖండ్లో అకస్మిక వరదలు సంభవించడంతో దాదాపుగా 12 మంది గల్లంతయ్యారు. కేదార్నాథ్ యాత్ర మార్గంలోని గౌరీకుంద్ సమీపంలోని మూడు షాపులు కూడా కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి అకస్మికంగా వరదలు వచ్చాయని చెప్పారు. NDRF, SDRF బృందాలు సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. గల్లంతయిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు.