విదేశాల నుంచి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ట్రాన్సిషన్ కాలానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. చైనా నుంచి కంప్యూటర్ల దిగుమతిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.