రాత్రి మిగిలిన అన్నంతో టేస్టీ రైస్ వడ తయారు చేసుకోవచ్చు. అన్నంను మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర తరుగు, తరిగిన కరివేపాకు వేసి కలపాలి. అందులో కాస్త బియ్యం పిండి కలిపి మెత్తగా చేసుకోవాలి. వాటిని వడలా తయారు చేసుకుని నూనెలో వేయించుకోవాలి. ఈ వడలపై పల్లీ చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరూ కూడా ఒకసారి ట్రై చేయండి.