ఏపీలోని విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లకు అంగీకరిస్తున్నట్లు ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, 3 డిస్కంల యాజమాన్యాలు తెలిపాయి. మెడికల్ రీయింబర్స్ మెంట్ ను రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు, దీర్ఘకాలిక వ్యాధుల మెడికల్ సదుపాయాన్ని రూ. 12 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంచుతామన్నాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే ముందుగా డిపార్ట్ మెంట్ ఇచ్చే నగదును వాడుకొని, తర్వాత సెల్ఫ్ ఫండ్ స్కీం డబ్బు వాడుకునేందుకు అనుమతించాయి.