అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పథకం పనులకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 6న (ఆదివారం) వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం రూ.24,470 కోట్లు వెచ్చించనుంది. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, సూచికలు ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 508 రైల్వేస్టేషన్లలో తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్లో 18 స్టేషన్లు ఉన్నాయి.