దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో విజయవాడ డివిజన్లో రూ.270 కోట్లతో 11 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎమ్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. రెండో దశలో మరో 9 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.