తిరుపతి జిల్లా సత్యవేడులో నాలుగో సచివాలయం పరిధిలోని కొమటిగుంటలో శుక్రవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి లబ్ధిదారులకు బ్రోచర్లు ఇస్తూ ప్రభుత్వం తరఫున ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిదగ్గర మహిళలు హారతులు పట్టి మాలలు వేసి డప్పులతో ఘనస్వాగతం పలికారు.