యూపీలోని మీరట్ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 16 నెలల్లో 81 మంది గర్భిణీలను హెచ్ఐవీ పాజిటివ్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేవలం జులై నెలలోనే 13 కొత్త కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ 81 మందిలో ఇప్పటికే 35 మంది పిల్లలకు జన్మనివ్వగా, వీరిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలకు హెచ్ఐవీ ఎలా సోకిందనే దానిపై తమ బృందంతో దర్యాప్తు చేపట్టామని చెప్పారు.