జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులుగా గుర్తించారు. వారి దగ్గరి నుంచి మూడు హాండ్ గ్రానేడ్లు, పది తుపాకీలు, 25 ఏకే-47 రౌండ్లు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ పట్టణంలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేయటానికి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.