అమెరికా అధ్యక్ష్య ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఇండియన్ అమెరికన్ మహిళా న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ ఎదుట ట్రంప్ హాజరయ్యారు. ఈ విషయంలో తాను నిర్దోషినని, తనకే పాపం తెలియదని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులే తనను ఈ కేసులో ఇరికించారని ట్రంప్ ఆరోపించారు.