చంద్రబాబు ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరని వైయస్ఆర్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బముగా అయన మాట్లాడుతూ.... ప్రాజెక్టుల సందర్శన కోసమంటూ చంద్రబాబు వచ్చి ప్రజాసేవ చేస్తున్న నన్ను తోప అంటున్నాడు ,అవునోకాదో ప్రజలు నిర్ణయిస్తారు. నేను చేసిన పనులు నిర్ణయిస్తాయని తెలిపారు. నిన్ను అణిచేస్తే...తొక్కేస్తా...దొంగదెబ్బ తీస్తానంటూ చంద్రబాబు మాట్లాడాడు. నువ్వు ఫ్యాక్షనిస్టువా...క్రిమినల్వా?. మోసగాడు, క్రిమినల్, దోపిడి దారుడు చంద్రాబాబూనే. చంద్రబాబుకు క్యారెక్టర్ ఉంటే కదా అసోసియేషన్ చేసేది. ఆ క్యారెక్టర్ అతనికి లేదు. నా నియోజకవర్గ ప్రజలను నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వారికోసం ఎందాకైనా రెడీనే. నన్ను బెదిరించే స్థాయి నీకు లేదు. నీతాటాకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. పెద్దగా గొంతు చించుకుని అరిస్తే భయపడే వారు లేరు ఇక్కడ. నేను ‘తోపు’నే. నువ్వు జన్మలో ముఖ్యమంత్రి కాలేవు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.