పుంగనూరులో వైకాపా శ్రేణులపై జరిగిన దాడిని శనివారం శింగనమల మండల వైసిపి నాయకులు ముచ్చుకోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మొదటగా టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే విధానాలను మార్చుకోవాలని సూచించారు. బాబు, టిడిపి పక్కా స్కెచ్ తోనే పోలీసులపై వైకాపా శ్రేణులపై టిడిపి శ్రేణులు దాడికి ఎగబడ్డాయన్నారు. దాడిని అడ్డుకున్న పోలీసులపై టిడిపి నాయకులు దాడులు చేయడం హేయనీయమైన చర్యగా అభివర్ణించారు.