పుంగనూరులో జరిగిన దాడుల్లో గాయపడిన పోలీసులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని.. అందుకే కావాలనే రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయంగా దివాళా తీశాడని మంత్రి ఎద్దేవా చేశారు. మొదట పుంగనూరు బైపాస్ నుంచి వెళ్తామని టీడీపీ నేతలు పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారన్న మంత్రి.. కానీ కావాలనే పుంగనూరులోకి వెళ్లాలని ప్రయత్నించారన్నారు. రాళ్లు రువ్వడం కోసం ముందుగానే రాళ్లను జమ చేసుకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేసేలా చేశారని మంత్రి ఆరోపించారు.