అమెరికాలోని తానా ఫౌండేషన్ ఛైర్మన్గా ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వల్లేపల్లి శశికాంత్ ఎన్నికయ్యారు. శశికాంత్ ప్రస్తుతం అమెరికాలోకి బోస్టన్లో స్థిరపడ్డారు. కొవిడ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడలో రోటరీక్లబ్ ద్వారా, వ్యక్తిగతంగా లక్షలాది రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఎన్నికపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.